Tuesday, April 14, 2026

జెలెన్ స్కీ ఎమోషనల్.. ఓదార్చిన మోదీ

Share

భారత ప్రధాని నరేంద్ర మోదీ ఉక్రెయిన్లో పర్యటిస్తున్న విషయం తెలిసిందే. మోదీకి స్వాగతం పలికిన ఆ దేశ ప్రెసిడెంట్ జెలెన్స్కీ భావోద్వేగానికి గురయ్యారు.

రష్యా చేస్తున్న దాడుల్లో ప్రాణాలు కోల్పోయిన పిల్లల చిత్రాలను చూస్తుండగా ఆయన ఎమోషనల్ అయ్యారు. మోదీ ఆయనను భుజం తట్టి ఓదార్చారు. స్మారకచిహ్నం వద్ద చిన్నారులకు నివాళులర్పించిన మోదీ ఆ స్థలంలో జెలెన్క్సీతో పాటు బొమ్మను ఉంచారు.

1991లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత ఆ దేశాన్ని సందర్శించిన తొలి భారత ప్రధానిగా నరేంద్ర మోడీ పర్యటించారు. ఉక్రెయిన్ మరియు రష్యా మధ్య కొనసాగుతున్న సంఘర్షణకు సంబంధించి తన దృఢమైన వైఖరిని మోదీ నొక్కిచెప్పారు. భారతదేశం మొదటి నుండి తటస్థంగా లేదని, శాంతి కోసం దృఢంగా నిలబడుతుందని అన్నారు. ఈ పర్యటనలో కీలక ఒప్పందాలపై సంతకాలు చేయడంతో పాటు శాంతి, సమతుల్య దౌత్యం మరియు ప్రపంచ సహకారానికి భారతదేశం నిబద్ధతతో ఉంటుందని అన్నారు. వ్యవసాయం, ఆహార పరిశ్రమ, వైద్య ఉత్పత్తుల నియంత్రణ మరియు సాంస్కృతిక సహకారం వంటి అంశాలకు సంబంధించిన పలు ఒప్పందాలను ప్రధాని మోదీ మరియు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ తమ సమావేశంలో ఖరారు చేశారు.

Read more

Local News