Wednesday, April 15, 2026

ఏలూరుకు వందేభారత్

Share

ఇకపై వందే భారత్ ఎక్స్ ప్రెస్ ఏలూరు రైల్వే స్టేషన్లో ఆగుతుందని ఎంపీ పుట్టా మహేష్ కుమార్ తెలిపారు. ఆగస్టు 25 ఆదివారం నుంచి ఏలూరు జిల్లా ప్రజలు వందేభారత్ రైలు సౌకర్యాన్ని వినియోగించుకునే అవకాశం కల్పిస్తూ రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది.

విశాఖపట్నం నుండి సికింద్రాబాద్ వెళ్ళే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20708) ఆగష్టు 25న మధ్యాహ్నం 02:35 నిమిషాలకు విశాఖపట్నం లో బయలుదేరి సాయింత్రం 5:54 నిమిషాలకు ఏలూరు రైల్వేస్టేషన్ కు చేరుకొని 5:55 నిమిషాలకు రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి సికింద్రాబాద్ కు రాత్రి 11:20 నిమిషాలకు చేరుకుంటుంది. మరియు సికింద్రాబాద్ నుండి విశాఖపట్నం వెళ్లే వందేభారత్ ఎక్స్ ప్రెస్ రైలు (20707) ఆగష్టు 26 సికింద్రాబాద్ లో ఉదయం 05:05 నిమిషాలకు బయలుదేరి 09:49 నిమిషాలకి ఏలూరు రైల్వేస్టేషన్ చేరుకొని 09:50 నిమిషాలకు రైల్వేస్టేషన్ నుండి బయలుదేరి విశాఖపట్నం రైల్వే స్టేషన్ కి మధ్యాహ్నం 01:50 నిమిషాలకు చేరుకుంటుంది.

ఈ సందర్బంగా ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు.వందేభారత్ కు ఏలూరులో హల్ట్ ఇచ్చినందుకు దేశ ప్రధాని నరేంద్ర మోడి గారికి, కేంద్ర రైల్వే మంత్రివర్యులు అశ్విని వైష్ణవ్ కు, ప్రిన్సిపల్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ దేవేంద్రకుమార్, రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రాష్ట్ర మంత్రివర్యులు నారా లోకేష్ గారికి ఎంపీ పుట్టా మహేష్ కుమార్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.

Read more

Local News