ఢిల్లీలో భారతదేశపు తొలి జాతీయ అంతరిక్ష దినోత్సవ వేడుకలు జరుగుతున్నాయి. చంద్రునిపై చంద్రయాన్-3 విజయవంతంగా ల్యాండింగ్ అయిన జ్ఞాపకార్థం భారతదేశంలో ఆగస్టు 23ను జాతీయ అంతరిక్షదినోత్సవంగా ప్రధాని నరేంద్రమోదీ ప్రకటించారు.

ల్యాండింగ్ సైట్కు ‘శివశక్తి’ పాయింట్ అని పేరు పెట్టారు. జాతీయ అంతరిక్ష దినోత్సవాన్ని పురస్కరించుకుని ఢిల్లీలోని భారత్ మండపంలో రెండు రోజుల గ్రాండ్ ఈవెంట్ జరగనుంది. ఇందులో మన దేశ అంతరిక్ష విజయాలకు సంబంధించిన హై-ప్రొఫైల్ సెషన్లు, ఇంటరాక్టివ్ ఎగ్జిబిషన్లు మరియు ముఖ్యమైన ప్రకటనలను ప్రదర్శిస్తారు.

ఈ సందర్భంగా నరేంద్రమోదీ తన ట్విట్టర్ పోస్టు ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు. అంతరిక్షరంగంలో శాస్త్రవేత్తల కృషి చిరస్మరణీయమని మన దేశం సాధించిన విజయాలను ఎంతో గర్వంగా స్మరించుకుంటున్నామన్నారు. మరిన్ని విజయాలను సాధించేందుకు ప్రభుత్వం అవసరమైన సహాయసహకారాలు అందిస్తుందని పేర్కొన్నారు.

