రాష్ర్టంలోనే పూర్తి సౌరశక్తితో పనిచేసే మొదటి గ్రామంగా మన్యచివాడి నిలిచింది. మహారాష్ట్రలోని సతారాజిల్లాలో ఉన్న ఈ గ్రామంలో వందశాతం సౌరశక్తితో విద్యుత్ వినియోగించబడుతుంది. ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే ఈ సోలార్ విలేజ్ స్కీమ్ ను లాంఛనంగా ప్రారంభించారు.

100% సౌరశక్తితో 100 గ్రామాలకు విద్యుత్ అందించడమే లక్ష్యంగా మహారాష్ట్రలో పునరుత్పాదక శక్తిని, ముఖ్యంగా సౌరశక్తిని ప్రోత్సహించడానికి ప్రభుత్వం చేపట్టిన చొరవ. దీని ద్వారా ప్రతి జిల్లాలో రెండు గ్రామాలకు పూర్తిస్థాయిలో సోలార్ విద్యుత్ అందించాలనేది ప్రణాళిక. సూర్యగఢ్ మఫ్ట్ బిజిలీ యోజన పథకం కింద ఈ గృహాలు ఎలాంటి విద్యుత్ బిల్లులు చెల్లించాల్సిన అవసరం లేదు. మరియు రైతులకు ఇది ఎంతో ప్రయోజనకరం. ఈ పథకం స్థానిక ఆర్థిక వ్యవస్థలకు సహాయం అందించడంతో పాటు ప్రజల జీవితాలను మెరుగుపరచడమే లక్ష్యంగా పనిచేస్తుంది. ఈ విజయాన్ని మహారాష్ట్రలోని మరిన్ని గ్రామాలకు విస్తరించాలని ప్రభుత్వం యోచిస్తోంది.

