Saturday, May 2, 2026

సీఎం రేవంత్ కి ఈటల సవాల్…

Share

వరంగల్లో ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ లో మాట్లాడుతూ…

ఈరోజు ములుగు మల్లంపల్లి ఏరియాలో రైతులు నన్ను కలిశారు.
రైతు రుణమాఫీ పై అనేక అనుమానాలు, ప్రశ్నలు లేవనెత్తారు.
పేరుకు మాత్రమే తప్ప అందరికీ రుణమాఫీ అవ్వటం లేదని చెప్పారు.
ఇప్పటివరకు కేవలం 50% మాత్రమే రుణమాఫీ అయిందని చెప్పారు.

ఎస్ ఎల్ బి సి ప్రకారం 71 లక్షల మంది రైతులు రుణం తీసుకున్నారు.ఎన్నికల ప్రచారంలో భాగంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రెండు లక్షల రూపాయల రుణాలు మాఫీ చేస్తాము ఎవరైనా తీసుకోకపోతే వెంటనే వెళ్లి బ్యాంకులో రుణం తీసుకోండి అని చెప్పారు ఆయన లెక్క ప్రకారం ఆరోజు 64 లక్షల మంది రైతులు అని చెప్పారు.తర్వాత 49 లక్షలు మందికి కుదించారు.

నిబంధనల పేరుతో రైతుల సంఖ్యను తగ్గించే ప్రయత్నం చేసినప్పుడు..
రుణమాఫీ చేస్తావా లేదా ? నీ మాట మీద నమ్మకం ఉందా లేదా ?
నీది నాలుకన తాటి మట్టనా అని కూడా మేమందరము ప్రశ్నించాము.

నేనొక్కడే రైతులను ఉద్ధరిస్తున్నట్టు..అధికారంలోకి రాగానే రైతుల ఆత్మహత్యలు ఆగిపోయాయని..అనేక పత్రికప్రకటనలు ఇచ్చుకున్నారు.
పత్రికా ప్రకటనలతో రైతుల కడుపు నిండడం లేదని గుర్తు పెట్టుకోండి.

ఇప్పటివరకు..
మొదటి విడతలో.. 11.5 లక్షల మంది రైతులకు 6095 కోట్ల రూపాయలు,
రెండవ విడతలో.. 1.49 లక్ష లోపు రుణం ఉన్న.. సుమారు 6 లక్షల మంది రైతులకు ఆరువేల కోట్లు. మొత్తంగా 18 లక్షల మంది రైతులకు 12 లక్షల కోట్ల రూపాయల రుణమాఫీ చేశారు.
ఇంకా 31 లక్షల మంది రైతులకు రుణమాఫీ చేయాలి. కానీ అల్లికి అల్లి సున్నకు సున్న అన్నట్టు చేస్తున్నారు.

తెల్లరేషన్ కార్డు పేరుతో కిరికిరి పెట్టి రైతుల సంఖ్యను తగ్గించి వేశారు ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే రుణమాఫీ చేస్తున్నారు. డిసెంబర్ 9వ తారీకు తర్వాత అయ్యే వడ్డీ మొత్తం రైతే చెల్లించాలని చెప్తున్నారు ఇది మీకు సమంజసమా రేవంత్ రెడ్డి గారు. ఈ మధ్యకాలంలో పిల్లల చదువుల కోసం, ఇంటి నిర్మాణం కోసం రైతులు కూడా ఐటీ రిటర్న్స్ చేస్తున్నారు. వీరిని కూడా రుణమాఫీకి అనర్హులుగా ప్రకటించారు. 72 లక్షల మందికి చేయాల్సిన రుణమాఫీని 22 లక్షల మందితో సరిపెడుతున్నారు. రుణమాఫీ అవ్వక రైతులు ఆందోళనలో ఉన్నారు. బాధపడుతున్నారు.

ఇవి కాకుండా రైతు బంధు పేరుతో రైతులకు, కౌలు రైతులకు 15 వేల రూపాయలు ఇస్తామన్నారు. వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయలు ఇస్తామన్నారు.
వరికి 500 రూపాయల బోనస్ ఇస్తామన్నారు.
ఆరు గ్యారెంటీలు, 66 రకాల హామీలు, 420 రకాల పనులు చేస్తామని.. సోనియా గాంధీ, రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సమక్షంలో..
పలు పాలసీల పేరుతో హామీలు ఇచ్చారు.
సూటిగా అడుగుతున్నాను.. పంట జూన్ నెలలో వేస్తాము ఇప్పుడు ఆగస్టు నెల అయినా రైతు బంధు ఇవ్వలేకపోయినా మాట వాస్తవం కాదా.
రైతుబంధు ఇవ్వకుండా రుణమాఫీ పేరుతో విడుదల చేశారు దీనిమీద చర్చకు సిద్ధమా అని రేవంత్ కి సవాలు విసిరుతున్నాము.

ఇచ్చిన హామీలు అమలు చేయకుండా డైవర్టింగ్ పాలసీతో ముందుకు పోతున్నారు. మీరు కూడా కేసీఆర్ బాటలో నడుస్తున్నారు. పెరిగిన పెన్షన్ కోసం వృద్ధులు, స్కూటీ కోసం కాలేజీ విద్యార్థులు, 2500 రూపాయల కోసం మహిళలు ఎదురు చేస్తున్నారు. ఇచ్చిన హామీలు కాంగ్రెస్ మర్చిపోవచ్చు కానీ మేము మర్చిపోము మిమ్మల్ని ప్రజాక్షేత్రంలో ఎండగడతాం. తాటికాయ అంత అక్షరాలతో పత్రికల్లో వేస్తున్న ప్రకటనతో రైతుల కడుపు నిండదు.

రైతులకు మీరు నాలుగు హామీలు ఇచ్చారు..
ఎలాంటి ఆంక్షలు లేకుండా రుణమాఫీ చేస్తామని అన్నారు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
రైతులకు, కౌలు రైతులకు 15వేల రూపాయలు, వ్యవసాయ కూలీలకు 12 వేల రూపాయల, రైతుబంధును వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాము.
అన్ని రకాల వడ్లకు 500 రూపాయల బోనస్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం.
రైతు కూలీలకు 12 వేల రూపాయల భృతి ఇస్తామని చెప్పారు వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నాం.

ప్రజలు మిమ్మల్ని చూసి, మీ గొప్పతనం చూసి ఓట్లు వేయలేదు కేసీఆర్ ను ఓడించటానికి మిమ్మల్ని గెలిపించారు అని మర్చిపోకు. మోసం చేస్తే మీరు ఎంతో దూరం పోలేరు. ఇంకా మీకు అధికారం ఉంది నాలుగు సంవత్సరాలే. ప్రతి గ్రామపంచాయతీ నుంచి ఎవరికి రుణమాఫీ కాలేదు వివరాలు సేకరిస్తున్నాం. వాటన్నిటిని ప్రచురించి మీ ముందు పెడతాం, ఎండగడతాం. రైతులతో కలిసి రైతు ఉద్యమాన్ని చేపట్టి ప్రభుత్వం మెడలో వంచుతామని రైతులకు హామీ ఇస్తున్నాము.

Read more

Local News