
swecha media,hyderabad:
దేవుడిని నమ్మని తిన్నడు (మంచు విష్ణు) భక్త కన్నప్పగా ఎలా మారతాడనేదే కథ. సినిమా మొత్తాన్ని విష్ణ. నడిపిస్తారు. సెకండాఫ్ లో ప్రభాస్ ఎంట్రీతో మరో స్థాయికి వెళ్తుంది. ఎమోషనల్ సీన్లు కనెక్ట్ అవుతాయి. మ్యూజిక్ బాగుంది. చివరి 40 ని.లు ప్లస్. ఫస్టాఫ్ బోరింగ్ గా సాగడం, అనవసరమైన సీన్లు ప్రేక్షకులను ఇబ్బంది. పెడతాయి. భక్తి సినిమాలో హీరోహీరోయిన్ల మధ్య రొమాంటిక్ సన్నివేశాలు ఎబ్బెట్టుగా ఉంటాయి.
రేటింగ్: 2.75/5.
తిన్నడుగా తనలోని వీరత్వాన్ని చూపించిన మంచు విష్ణు.. భక్తుడిగా మారాక మరింత ఎమోషన్ పంచారు. ఆయన పలికిన సంభాషణలు, ప్రదర్శించిన హావభావాలు మెప్పిస్తాయి. పతాక సన్నివేశాల్లో ఆయన నటన గొప్ప భావోద్వేగాల్ని పండించింది.
- ప్రభాస్ (Prabhas) రాకతో ఈ సినిమా మరో స్థాయికి వెళుతుంది. కేవలం సంభాషణలతోనే ఆయన విజిల్స్ కొట్టిస్తారు. రుద్ర పాత్ర ప్రభావం అలాంటిది. శివపార్వతుల్లా అక్షయ్ కుమార్, కాజల్ కనిపిస్తారు.
- మోహన్ బాబు, మోహన్ లాల్ అతిథి పాత్రల్లా కాసేపే మెరిసినా సినిమాపై గొప్ప ప్రభావం చూపిస్తారు. శరత్ కుమార్ పాత్ర, నటన ఆకట్టుకుంటుంది.
- ప్రీతి ముకుందన్ కీలకమైన పాత్రలో కనిపిస్తుంది. నెమలి పాత్రలో ఆమె అందంతోనూ కట్టిపడేస్తుంది. పాటలతో అందరి దృష్టినీ ఆకర్షించిందామె. ముఖేష్ రుషి, మధుబాల, దేవరాజ్ తదితరులు గూడేల పెద్దలుగా కనిపిస్తారు. బ్రహ్మానందం చిన్న పాత్రలోనే కనిపిస్తారు.

