
స్వేచ్ఛ మీడియా,హైదరాబాద్ : నెటిజన్లు అంతా ఎంతో ఆత్రుతగా ఎదురుచూస్తోన్న మూవీ కన్నప్ప . ఈ మూవీపై సినీ లవర్స్ భారీ అంచనాలు పెంచేసుకున్నారు. ఏవీఏ ఎంటర్టైన్మెంట్, 24 ఫ్రేమ్స్ ఫ్యాక్టరీ బ్యానర్లపై డాక్టర్ మోహన్ బాబు నిర్మించిన ఈ చిత్రానికి ముఖేశ్ కుమార్ సింగ్ దర్శకత్వం వహించారు. అలాగే మోహన్ లాల్, విష్ణు మంచు, అక్షయ్ కుమార్, ప్రభాస్, కాజల్ అగర్వాల్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు.
ఈ మూవీలో మోహన్ బాబు మనవరాళ్లైన అరియానా, వివియానా శ్రీ కాళహస్తి పురాణాన్ని వివరించడానికి తమ గాత్రాలు అందించారు. వీరు ఇద్దరూ కన్నప్ప సినిమా ద్వారానే తమ గాత్రాలతో సినీ ఇండస్ట్రీకి ఎంట్రీ ఇస్తున్నారు. ఇప్పటికే ఈ సంతోషంలో మోహన్ బాబు ఈ విషయంపై గర్వపడుతున్నానని, వారిద్దరూ ఈ పురాణాన్ని వివరించడం సంతోషంగా ఉందని సోషల్ మీడియాలో అభిమానులతో పంచుకున్న విషయం తెలిసిందే.
ఇక ఈ మూవీ నుంచి ఇప్పటికే విడుదలైన పోస్టర్లు నెటిజన్లను ఆకట్టుకోవడమే కాకుండా సినిమాపై భారీ అంచనాలు పెంచాయి. రెండు సంవత్సరాల క్రితం షూటింగ్ ప్రారంభించిన కన్నప్ప నేడు థియేటర్లలో గ్రాండ్ విడుదల అవ్వనుంది. కాగా ఈ సందర్భంగా పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ సోషల్ మీడియా వేదికన తన సంతోషాన్ని పంచుకున్నారు. “కన్నప్ప పెద్ద తెరపైకి వస్తున్నాడు. తన ప్రాణం కంటే ఎక్కువ ఇచ్చిన వ్యక్తి ఇతిహాస కథ ఇది. కన్నప్ప ఇప్పుడు దైవిక శరణాగతి సాక్షిగా నటిస్తున్నాడు”. అంటూ పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ రాసుకొచ్చారు.

మంచు విష్ణు కలల ప్రాజెక్ట్ గా రూపొందిన కన్నప్ప ఫై ఎక్స్ వేదికగా ఎమోషనల్ పోస్ట్.
“ఈ క్షణం కోసం జీవితమంతా ఎదురుచూశాను. ఓవర్సీస్ ప్రీమియర్స్లో, ఇండియాలో మొదటి ఆటకు వస్తోన్న పాజిటివ్ రెస్పాన్స్, ఆడియన్స్ ఈ సినిమాపై చూపుతోన్న ప్రేమను చూస్తోంటే నా హృదయం కృతజ్ఞతా భావంతో నిండిపోతోంది. ‘కన్నప్ప’ ఇక నా సినిమా కాదు.. ఈ క్షణం నుంచి ఇది మీ సినిమా” అని తన పోస్ట్లో రాసుకొచ్చారు . ఇక ఇందులో కిరాత పాత్రలో నటించిన మోహన్లాల్ కూడా సినిమాపై పోస్ట్ పెట్టారు. అందరూ దగ్గర్లోని థియేటర్లలో ‘కన్నప్ప’ను చూడాలని కోరారు.

