Tuesday, April 14, 2026

29 న నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం

29 న నిజామాబాద్ లో పసుపు బోర్డు ప్రారంభోత్సవం

Share

•స్వేచ్ఛ మీడియా ,నిజామాబాద్ .
అమిత్ షా చేతుల మీదుగా పసుపు బోర్డు ప్రారంభోత్సవం .
అనంతరం నిజామాబాద్ లో రైతు సమ్మేళన బహిరంగ సభ: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి

కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా ఈ నెల 29న నిజామాబాద్లో పసుపు బోర్డు కార్యాలయాన్ని ప్రారంభిస్తారని కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి.కిషన్ రెడ్డి తెలిపారు. అదే రోజు జరిగే రైతు సమ్మేళనం బహిరంగసభలో కూడా పాల్గొంటారని చెప్పారు. గురు వారం నిజామాబాద్ పర్యటనకు వచ్చిన కిషన్ రెడ్డి ,ఎంపీ ధర్మపురి అరవింద్ తో కలిసి మీడియాతో మాట్లాడారు.

40 ఏళ్ల రైతుల ఆకాంక్ష, అనేక పోరాటాలు, ఉద్యమాల ఫలితంగా కేంద్రం నిజామాబాద్ కు పసుపు బోర్డు ప్రకటించిందన్నారు. ఎంపీ అరవింద్ కృషితో రాష్ట్ర, జాతీయ పార్టీ నిర్ణయం, ప్రధాని మోదీ ఆశీ స్సులతో పసుపు బోర్డు ఏర్పడిందని చెప్పారు. సీనియర్ నేత, దివంగత ధర్మపురి శ్రీనివాస్ విగ్రహాన్ని అమిత్ షా ఆవిష్కరించనున్నట్టు కిషన్ రెడ్డి తెలిపారు. ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి, కాంగ్రెస్ నాయకులకు చిత్తశుద్ధి ఉంటే ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐకి అప్పగించాలన్నారు.రేవంత్రెడ్డి టీపీసీసీ చీఫ్ గా ఉన్న సమయంలో ఫోన్ ట్యాపింగ్ కేసును సీబీఐతో విచారణ చేయించాలని డిమాండ్ చేసిన విషయాన్ని గుర్తు చేశారు. తెలంగాణ పోలీసులపై తెలంగాణ పోలీసులే దర్యాప్తు చేస్తే న్యాయం జరగదన్నారు. సమావేశంలో నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే ధన్పాల్ సూర్యనారాయణ పాల్గొన్నారు.

Read more

Local News