Tuesday, April 14, 2026

ఫోన్ టాపింగ్ కేసు, ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి కి SIT నోటీసులు.

ఫోన్ టాపింగ్ కేసు, ఎంపీ కొండా విశ్వేశ్వరెడ్డి కి SIT నోటీసులు.

Share

స్వేచ్ఛ మీడియా ,హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో ప్రస్తుతం హాట్ టాపిక్ గా మారిన ఫోన్ ట్యాపింగ్ కేసు రోజుకో మలుపు తిరుగుతుంది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావు అమెరికా నుంచి వచ్చి విచారణకు హాజరయ్యారు. దీంతో ఆయన విచారణలో కీలక విషయాలను గుర్తించిన అధికారులు. ట్యాపింగ్ కు గురైన నేతలకు నోటీసులు ఇచ్చి. స్టేట్ మెంట్ రికార్డు చేస్తున్నారు. ఇందులో భాగంగా చేవెళ్ళ ఎంపీ , బీజేపీ నేత కొండా విశ్వేశ్వర్ రెడ్డి కి నోటీసులు జారీ అయ్యాయి. ఈ కేసులను స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీమ్ (SIT) దర్యాప్తు చేస్తోంది. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ఈ రోజు ఉదయం 11 గంటలకు విచారణకు హాజరై తన స్టేట్మెంట్ ఇవ్వాలని SIT అధికారులు నోటీసులు జారీ చేశారు.

ఈ కేసు తెలంగాణలో భారత రాష్ట్ర సమితి (BRS) ప్రభుత్వం హయాంలో రాజకీయ నాయకులు, వ్యాపారవేత్తలు, మీడియా వ్యక్తుల ఫోన్లను ట్యాప్ చేసినట్లు అధికారులు గుర్తించారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డి, బీజేపీ నాయకుడిగా, తన ఫోన్ కూడా ట్యాప్ చేయబడినట్లు ఆరోపించారు. ఈ విషయంలో విచారణకు సహకరించాలని SIT నోటీసులు జారీ చేసింది. ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్ రావు, వారి కుమారుడు కె.టి. రామారావు, ఇతర అధికారులతో సహా పలువురు ప్రముఖ వ్యక్తుల పేర్లు కూడా చర్చలో ఉన్నాయి. ప్రస్తుతం, SIT ఈ కేసులో లోతైన దర్యాప్తు చేస్తూ, ఫోన్ ట్యాపింగ్లో పాల్గొన్న వారిని గుర్తించేందుకు సాక్షులను విచారిస్తోంది.

Read more

Local News