Tuesday, April 14, 2026

BJP SANKALPA SABA AND AMURUTAKALAM

BJP SANKALPA SABA AND AMURUTAKALAM

Share

21 జూన్ 2025
సికింద్రాబాద్.

ఈటల రాజేందర్ ప్రెస్ మీట్ @ ఇంపీరియల్ గార్డెన్.

11 ఏళ్ల అభివృద్ధిపై దేశవ్యాప్తంగా ఎగ్జిబిషన్లు, సమావేశాలు జరుగుతున్నాయి.
మల్కాజ్గిరి దేశంలోనే అతిపెద్ద నియోజకవర్గం.
38.4 లక్షల ఓట్లు ఉన్నాయి.
బీజేపీనీ 4 లక్షల మెజారిటీతో గెలిపించారు.
ఎల్బీనగర్ నియోజకవర్గం లో పోలైన ఓట్లలో 65 % ఓట్లు వేసి గెలిపించారు.
ప్రజలు విశ్వాసాన్ని, నమ్మకాన్ని నా మీద ఉంచారు నాకు ఉన్న అనుభవం పరిచయాలతో.. వారి నోట్లో నాలుకలాగా ఉన్నంతలో వారి ప్రేమను పొందే ప్రయత్నం చేశాను.. ఉన్నంతలో వారి సమస్యలను తీర్చే ప్రయత్నం చేశాను.

11 సంవత్సరాల మోడీ గారి పాలన సంవత్సర కాలంగా నేను ప్రజల్లో గడిపిన కాలాన్ని ఎగ్జిబిషన్ రూపంలో చెప్పబోతున్నాము.

ఉద్యమకాలంలో అసెంబ్లీ ఫ్లోర్ లీడర్ గా, తొలి ఆర్థిక మంత్రిగా, కష్ట కాలంలో కరోనా మంత్రిగా పని చేసిన నామీద అపారమైన నమ్మకం ప్రజలకు ఉంది.
అనేక ఉద్యమాలు చేసిన వాన్ని కాబట్టి మల్కాజిగిరిలో కూడా ప్రజా వ్యతిరేక ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం చేయడంలో నావంతుపాత్ర పోషించాను.

రేవంత్ రెడ్డి అధికారంలోకి రాగానే ఓట్లు వేసిన ప్రజల మీదనే దౌర్జన్యం చేసే అన్యాయానికి ఒడిగట్టాడు. అందులో మొదటిది హైడ్రా.
హైడ్రా పేరిట సమాజాన్ని ఉద్ధరిస్తానని చెప్పి అనేక పేద ప్రజల ఇళ్లను కూలగొట్టే ప్రయత్నం చేశారు.
ఏడ్చినా కూడా ఈ ప్రభుత్వానికి కనికరం రాలేదు.
ప్రభుత్వం కన్నీళ్లు తుడుస్తుంది కానీ ఈ ప్రభుత్వం కన్నీరు పెట్టించింది.
ప్రభుత్వం భూములు ఇస్తుంది కానీ లాక్కునే ప్రయత్నం చేసింది.

మూసి ప్రక్షాళన పేరిట రియల్ ఎస్టేట్ వ్యాపారం కోసం కాలనీలను కూలగొట్టే ప్రయత్నం చేసినప్పుడు రామంతపూర్ ఉప్పల్ ఎల్బీనగర్ చైతన్యపురి ప్రాంతాలలో మూసికి అటు ఇటు ఉన్న ప్రజలకు అండగా నిలబడ్డాము. నిలబడి ధైర్యాన్ని ఇచ్చి కాపాడుకున్నాము.

అనేక సంవత్సరాలుగా డ్రైనేజీ తాగునీరు రోడ్ల సమస్యలతో ప్రజలు అల్లాడుతున్నప్పుడు వారికి అండగా ఉండి వారి కుటుంబ సభ్యులు లాగా పనిచేస్తున్నాను.

బాధ ఉన్న సమస్య ఉన్న మా ఎంపీ గారు ఉన్నారనే ధైర్యాన్ని కల్పించాము.

అసైన్మెంట్ భూములను గుంజుకునే ప్రయత్నం చేస్తే మీ అబ్బ జాగీర్ కాదని అడ్డుకున్నాము.

ఈ ప్రభుత్వం వల్ల బుచ్చమ్మ ఆత్మహత్య చేసుకుంది, అనేకమంది కంట నీరు పెట్టుకున్నారు.

కాలుకు ముళ్లు విరిగితే పన్నుతో పీకే సర్వీస్ చేస్తా అని హామీ ఇచ్చి వారి ప్రేమను పొంది గెలిచిన అందుకు అనుగుణంగా పని చేస్తున్నా.

ఈ మీటింగ్ కి అందరూ ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతున్నారు.

నియోజకవర్గ ప్రజలు అందరూ హాజరై విజయవంతం చేయాలని పేరుపేరునా మిమ్మల్ని కోరుతున్నాము.

కంటోన్మెంట్ నియోజకవర్గం కేంద్రం పరిధిలో ఉంది ఇక్కడ నిధులకు కొరత లేదు.
రోడ్లు వేయడానికి అవసరమైన భూములు ఇవ్వడానికి రక్షణ శాఖ ఆమోదం తెలిపింది. ఆ భూమికి ఇచ్చే నష్టపరిహారం 300 కోట్లు కూడా కంటోన్మెంట్ కే ఇస్తుంది.
కంపాషినేట్ పోస్ట్ లలో ఉన్న 5 % నిబంధన ఎత్తివేసి ఉద్యోగాలు ఇప్పించిన ఘనత బీజేపీదే.

₹₹₹

Read more

Local News