Wednesday, April 15, 2026

TG: మొక్కుబడిగా దిశా మీటింగ్స్, అగ్రహించిన ఎంపీ ఈటల

Share

02.05.2025
హైదరాబాద్

తెలంగాణ బాగుపడడమే మా లక్ష్యం.
రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోయినా రైల్వే పనులకు నిధులు మేమే పూనుకొని తీసుకొని వస్తున్నాం.
కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు అని సంకుచిత వాదులు మాట్లాడతారు.
ఫలాలు అందాల్సింది నిరుపేదలకు అని మర్చిపోవద్దు.
సమస్యలపై లెటర్ రాస్తే అధికారులు స్పందించకపోతే ఎలా అని ఆగ్రహం వ్యక్తం చేసిన ఎంపీ ఈటల రాజేందర్.
……..

హైదరాబాద్ “జిల్లా అభివృద్ధి సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ”
“దిశ” సమావేశానికి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారితో కలిసి హాజరైన మల్కాజ్గిరి పార్లమెంట్ సభ్యులు ఈటల రాజేందర్.

ధనికులకు పేదలకు మధ్య అంతరం పెరుగుతుందని నిజమైన పేదలు పురోభివృద్ధి కోసం కొన్ని స్కీములను కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది.

కేంద్రం నేరుగా స్కీములను తీసుకురాదు కానీ.. స్మార్ట్ సిటీ, అమృత నగరాలు, స్వచ్ఛభారత్ వంటి స్కీములను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది. నగరాల అభివృద్ధికి నేరుగా డబ్బులు కేటాయిస్తున్నారు.

కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు కేంద్ర ప్రభుత్వ పథకాల పట్ల నిర్లక్ష్యం వహిస్తున్నాయనే ఉద్దేశంతో.. వారికి దిశా నిర్దేశం చేయడానికే దిశ సమావేశం.

అనేక స్కీములలో 60 శాతం నుండి 90 శాతం నిధులు కేంద్రమే ఇస్తుంది.. అయినా రాష్ట్ర ప్రభుత్వ వాటా కేటాయించకపోవడం వల్ల నిధులు ఖర్చు చేయలేకపోతున్నారు.

స్కిల్ డెవలప్మెంట్ కోసం పెద్దఎత్తున నిధులు మంజూరు చేస్తున్నారు.
4 లక్షల కోట్ల రూపాయలు బాజప్తా బడ్జెట్లో పెట్టారు.

కేంద్రం స్ఫూర్తి అర్థం చేసుకోవాలని అధికారులను కోరుతున్నాను.

కేంద్రం నిధులు రాష్ట్రం నిధులు అని సంకుచిత వాదులు మాట్లాడతారు.

నిజమైన అభివృద్ధి కోరుకునేవారు ఇలా మాట్లాడరు.
ఎవరు ఖర్చు చేసినా అవి ప్రజల చెమటపైసలతో కట్టిన టాక్స్ లే.

హైదరాబాదులో ప్రజలు ఎదుర్కొంటున్న ట్రాఫిక్ సమస్యలను కేంద్ర ప్రభుత్వం నిధులతో నిర్మించిన ఫ్లైఓవర్లు తీరుస్తున్నాయి. ఈ నెల ఐదవ తేదీ నడ్డా గారు అనేక ఫ్లైఓవర్లను ప్రజలకు అంకితం చేస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం ఏం నిధులు ఇచ్చిందని ప్రశ్నించినవారికి ఇవి కనిపించడం లేదా ?
అధికారులు సమస్యలు మా దృష్టికీ తీసుకురండి ఇంకా ఎన్ని నిధులు అయినా తీసుకువస్తాము.
రాష్ట్రప్రభుత్వ సహకారం లేకపోయినా రైల్వే పనులకు నిధులు మేమే పూనుకొని తీసుకొని వస్తున్నాం.

తెలంగాణ బాగుపడడమే మా లక్ష్యం.

రూరల్ పావర్టీ అర్బన్ పావర్టీ కంటే చాలా దారుణమైనది.
నగరాల్లో ఉన్న కలెక్టర్లు ప్రో యాక్టివ్గా పని చేయాలని కోరుతున్నాను.

మీ దృష్టికి వచ్చిన సమస్యలు పరిష్కారం చేయండి.
మొక్కుబడిగా దిశ మీటింగ్ లు పెట్టవద్దు.

Read more

Local News