స్వతంత్ర భారతదేశంలో 48 ఏళ్లు ఈ దేశాన్ని పాలించిన పార్టీ కాంగ్రెస్.
వారు అధికారంలో ఉన్నప్పుడు ఏనాడు బీసీల జనగణన చేపట్టలేదు.
అణగారిన వర్గాలకు ఛాంపియన్ అని చెప్పి బీసీ ఎస్సీ ఎస్టీల ఓట్లు కొల్లగొట్టారు.
అధికారంలో ఉన్నప్పుడు చేయకుండా ప్రతిపక్షంలోకి వచ్చిన తర్వాత ముసలికన్నీరు కారుస్తున్నారు.
బీజేపీ 2014 లో ఒక ఓబీసీ బిడ్డను ప్రధానమంత్రిని చేసింది.
కేంద్ర మంత్రివర్గంలో 27 మంది ఓబీసీలను,
12 మంది ఎస్సీలను, 8 మంది ఎస్టీలను, 5 మంది మైనారిటీలకు స్థానం కల్పించారు.
60 శాతం మంది ఓబీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు మంత్రివర్గంలో స్థానం కల్పించి గౌరవం ఇచ్చారు.
2014 లో ఒక దళిత బిడ్డను
2021 లో ఆదివాసి అడవి బిడ్డను రాష్ట్రపతులను చేసిన ఘనత కూడా భారతీయ జనతా పార్టీకి దక్కుతుంది.
ముసలికన్నీరు కార్చే కాంగ్రెస్ కి చెంపపెట్టు లాగా దేశంలో కులగణన చేపట్టనుంది.
ఇది హర్షణీయం.
ఓబీసీలకు గొప్ప గుర్తింపు.
రాజకీయ సామాజిక విద్య ఉద్యోగాల పరంగా ఓబీసీలకు అవకాశాలు మరింత పెరుగుతాయి.
కేంద్ర ప్రభుత్వం నిర్ణయాన్ని స్వాగతిస్తున్నాము.
మోదీ గారికి మంత్రులకు కృతజ్ఞతలు.
బీజేపీ ఒక్కటే అణగారిన వర్గాలకు అండగా ఉంటుందని ఇది నిరూపించింది.
– ఈటల రాజేందర్.

