
నేటి నుంచి మార్చి1వ తేదీ వరకూ శ్రీశైలంలో 11 రోజుల పాటు మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. స్వామి వారికి అంగరంగవైభవంగా ఈ ఉత్సవాలు జరిపేందుకు ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా 22వ తేదీన టీటీడీ సంబంధిత అధికారులు, 23 తేదీన ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేతులమీదుగా స్వామి వారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్నారు. బ్రహ్మోత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు అన్ని ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు వెల్లడించారు.

