తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డికి నాంపల్లి కోర్టు నోటీసులు జారీచేసింది. బీజేపీ పరువునష్టం కేసుపై స్పందించిన ప్రత్యేక న్యాయస్థానం సెప్టెంబరు 25న ముఖ్యమంత్రి కోర్టుకు హాజరుకావాలని ఆదేశించింది. లోక్‌సభ ఎన్నికలకు ముందు తమపై అసత్య ప్రచారం చేశారంటూ బిజెపి కేసు దాఖలు చేసింది. కేంద్రంలో మళ్ళీ అధికారంలోకి వస్తే కాషాయ పార్టీ బడుగు బలహీన వర్గాలకు రిజర్వేషన్లు రద్దు చేస్తుందని, మరియు రాజ్యాంగాన్ని రద్దు చేస్తుందని ప్రచారం చేసి ప్రజల దృష్టిలో పరువు తీశారని ఆ పార్టీ ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు పిటిషన్లో పేర్కొన్నారు. ఈ కేసును త్వరగా విచారించారలని హైకోర్టు ఆదేశించడంతో నాంపల్లికోర్టు సీఎంకు సమన్లు జారీ చేసింది.


