Friday, May 1, 2026

గ్రెయిన్ ATM

జాతీయ ఆహార భద్రతా కార్యక్రమాన్ని పురస్కరించుకుని ఒడిశా ప్రభుత్వం మొట్టమొదటి గ్రెయిన్ ఏటీఎంను ప్రవేశపెట్టింది. కేంద్రప్రభుత్వ అన్నపూర్తి కార్యక్రమంలో భాగంగా ఆహార పంపిణీని మెరుగుపరచడానికి ప్రపంచ ఆహార కార్యక్రమం(WFP) సహకారంతో ఈ యంత్రాన్ని అభివృద్ధి చేసింది. మంచేశ్వర్ లోని ప్రారంభించిన ఈ గ్రెయిన్ ఏటీఎం విజయవంతమైతే ఒడిశా అంతటా మరిన్ని ఏటీఎంలు ఏర్పాటు చేయాలని భావిస్తున్నారు. ఎటువంటి అవినీతికి ఆస్కారం లేకుండా సక్రమంగా ఆహార ధాన్యాలు నేరుగా ప్రజలకు అందించేందుకు ఈ ఆటోమెటేడ్ యంత్రాలు ఉపయోగపడతాయి.. ఇప్పటికే ఇలాంటి ఏటీఎంలు అనేక దేశాల్లో వినియోగించబడుతున్నాయి. ఈ ఏటీఎంలు 24గంటలూ అందుబాటులో ఉండటమే కాకుండా భారతదేశంలో ఏ ప్రాంతానికి చెందిన రేషన్ కార్డు అయినా వినియోగించుకోవచ్చు. కేవలం ఐదునిమిషాల్లోనే యాభై కేజీల వరకూ ధాన్యాన్ని అందించగలదు. జాతీయ ఆహార భద్రతా చట్టం (NFSA), జనాభాలో మూడింట రెండు వంతుల మందికి సరసమైన ఆహార ధాన్యాలను అందించాలని లక్ష్యంగా పెట్టుకుంది. అవసరమైన వారికి పౌష్టికాహారం అందుబాటులోకి తీసుకురావడమే దిశగా 2021లో ప్రభుత్వం అన్నపూర్తిని ప్రారంభించింది. సాంకేతికతను వినియోగించి ఆహార పంపిణీని మరింత సమర్ధవంతంగా ప్రజలకు అందించడమే దీని ఉద్దేశం.

Share

Read more

Local News