Friday, May 1, 2026

చెస్ కాయిన్స్‌పై విష ప్రయోగం, రష్యాలో డేంజర్ బెల్స్

Share

రష్యన్ చెస్ ఛాంపియన్ అమీనా అబకరోవా తన ప్రత్యర్ధి చెస్ కాయిన్స్ పై విషప్రయోగం చేసిందన్న ఆరోపణలు ఎదుర్కుంటోంది. అమీనా మాజీ ప్రత్యర్ధి ఉమైగనత్ ఉస్మానోవాపై టోర్నమెంట్ సందర్భంగా చెస్ కాయిన్స్ మీద విషపూరిత పాదరసం పూసినందన్న ఆరోపణలతో సస్పెండ్ చేయబడింది. ఇందుకు సంబంధించిన సీసీటీవీ ఫుటేజ్ వైరల్ గా మారింది. దక్షిణ రష్యాలోని మఖచ్కలలో జరిగిన డాగేస్తాన్ చెస్ ఛాంపియన్‌షిప్ సందర్భంగా ఈ ఫుటేజ్ దొరికింది. అబకరోవా ఒస్మానోవా రావడానికి 20 నిమిషాల ముందు తను టోర్నమెంట్ గదిలోకి ప్రవేశించడం CCTVలో బంధించబడింది.

ఇందులో ఆమె తన పరిసరాలను గమనిస్తూ ప్రత్యర్థి టేబుల్ వైపు కదలడం.. బ్యాగ్ నుంచి ఒక వస్తువును తీయడం తరువాత చెస్ బోర్డు కాయిన్స్ పై ఓ పదార్ధాన్ని పోయడం వెంటనే గదిలోనుంచి బయటకు రావడం అంతా క్లియర్ గా రికార్డ్ అయింది. ఆట ప్రారంభమైనప్పుడు ఉస్మానోవా మరియు ఈవెంట్ నిర్వాహకులలో ఒకరు తలతిరగడం, వికారం వంటి లక్షణాలతో ఆస్వస్థతకు గురయ్యారు.. వెంటనే అత్యవసర వైద్యం అందించగా దీనికి కారణం పాదరసవిషం కారణమని తరువాత నిర్ధారించబడింది. కానీ తరువాత కోలుకున్న ఒస్మానోవా టోర్నమెంట్లో పాల్గొని రెండవ స్థానాన్ని దక్కించుకున్నారు. అనంతరం సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా అబకరోవాను అదుపులోకి తీసుకున్నారు. ఆమె దోషిగా తేలితే కనీసం మూడు సంవత్సరాల జైలు శిక్షను ఎదుర్కోవలసి ఉంటుంది.

Read more

Local News