Wednesday, April 15, 2026

ప్రొఫైల్ పిక్చర్లు మార్చమంటున్న ప్రధాని మోడీ

Share

ప్రొఫైల్ పిక్చర్‌లను త్రివర్ణ పతాకానికి మార్చంమంటూ నెటిజన్లకు తన పోస్టు ద్వారా పిలుపునిచ్చారు పీఎం మోడీ. 78వ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ముందు తన ప్రొఫైల్ చిత్రాన్ని త్రివర్ణ పతాకానికి మార్చారు. ఈ సంవత్సరం హర్ ఘర్ తిరంగాని మరచిపోలేని ప్రజా ఉద్యమంగా మార్చాలని ఇందుకోసం ‘హర్ ఘర్ తిరంగ అభియాన్’లో పాల్గొనాలని భారతీయులందరికీ తన సోషల్ మీడియా పోస్టు ద్వారా పిలుపునిచ్చారు. అంతేకాదు తిరంగాతో ఒక సెల్ఫీని harghartiranga.com లో షేర్ చేయమని ప్రోత్సహించారు. మరోవైపు స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 9 నుంచి 15వ తేదీ వరకు ‘హర్ ఘర్ తిరంగ’ మిషన్ మూడో వెర్షన్‌ను నిర్వహించనున్నట్లు కేంద్ర సాంస్కృతిక, పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ ప్రకటించారు.

Read more

Local News