
పార్లమెంటులో ఈటల…
తెలంగాణ రాష్ట్రంలో 1947 నుండి 2004 లోపు ఎన్ని కిలోమీటర్ల నేషనల్ హైవేలు నిర్మాణం అయ్యాయో.. గత పదేళ్లలో అంతకంటే ఎక్కువ కిలోమీటర్లు హైవేలు నిర్మాణం అయ్యాయి. హైదరాబాద్ నుండి విజయవాడ.. హైదరాబాద్ నుండి ఛత్తీస్గడ్.. హైదరాబాద్ నుండి నాగపూర్ జాతీయ రహదారులు నిర్మాణం అయ్యాయి. కానీ హైదరాబాద్ సిటీ లోపల ట్రాఫిక్ పెరిగిపోవడం వల్ల రోడ్డు ప్రమాదాలు పెరిగాయి. అందుకోసం అండర్ పాస్, ఓవర్ బ్రిడ్జిల నిర్మాణం చేయాల్సిన అవసరం ఉంది. దీనికి సంబంధించి రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాను... జోడిమెట్ల చౌరస్తా దగ్గర పది ఇంజనీరింగ్ కాలేజీకి సంబంధించిన దాదాపు 60 మంది విద్యార్థులు రోడ్డు ప్రమాదంలో మరణించారు. మంత్రి గారు చాలా క్రియాశీలకంగా స్పందిస్తారు కాబట్టి మీద్వారా వారిని విజ్ఞప్తి చేస్తున్నాను... విజయవాడ నేషనల్ హైవే పై రెండు ఓవర్ బ్రిడ్జెస్... అలాగే ఛత్తీస్ గడ్ హైవే పై రెండు ఓవర్ బ్రిడ్జెస్.. కొంపల్లి నుంచి నాగపూర్ హైవేపై ఓవర్ బ్రిడ్జిలు నిర్మాణం చేయాలని కోరుతున్నాము. ఈ మార్గాలలో మెట్రో రైలు నిర్మాణం చేయాలని డిమాండ్ కూడా ఉంది. ఓవర్ బ్రిడ్జి పనులు జరుగుతున్నాయి కాబట్టి ఈ రెండిటిని కలిపి కోఆర్డినేట్ చేసుకొని కన్స్ట్రక్ట్ చేస్తే తక్కువ ఖర్చు అవుతుంది. కాబట్టి దీన్ని పరిశీలించాలని మంత్రి గారిని పార్లమెంట్ లో కోరారు. నితిన్ గడ్కారీ మాట్లాడుతూ.. రెస్పెక్టెడ్ స్పీకర్ సార్ ఈటల రాజేందర్ గారు చాలా పనులు అడిగారు. హైదరాబాద్ రింగ్ రోడ్ కోసం 70 వేల కోట్ల రూపాయలు మంజూరు చేయడం జరిగింది. టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఈ పనులు మేము చేస్తామని చెప్పారు. 50% ల్యాండ్ అక్విజిషన్ కి సంబంధించిన డబ్బులు రాష్ట్ర ప్రభుత్వం ఇస్తామన్నారు. అది పూర్తి అవ్వగానే నిర్మాణం చేపడతాం. ప్రస్తుతమున్న ముఖ్యమంత్రిని కూడా కలపడం జరిగింది. విజయవాడ నుంచి హైదరాబాద్ హైవే రోడ్డుపై చాలా యాక్సిడెంట్లు అవుతున్నాయి. చాలామంది విద్యార్థులు చనిపోయారని కూడా మా దృష్టికి వచ్చింది. దీనికి మేము కూడా చింతిస్తున్నాము. ఈ విషయంపై త్వరలోనే ఒక నిర్ణయానికి వస్తాం. మిగతా పనులు అన్నీ కూడా చేపడతామని తెలియజేస్తున్నాం.
Share

Read more

